Wed Dec 17 2025 12:51:45 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కలన్నీ తేలుస్తాం : యనమల
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్థిక అవకతవకలపై సీఎం సహా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని యనమల ప్రకటించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నారని, రోడ్ల గుంతలు కూడా ఎందుకు పూడ్చలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
సిట్కు భయపడతామా?
అమరావతి రాజధాని భూములపై సిట్ వేస్తే ఏం జరుగుతుందని ఆయన నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. అడ్డదారిలో సంపాదించిన దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని యనమల రామకృష్ణుడు అన్నారు. అడ్డగోలుగా ఫైళ్లు నడిపితే బుక్కయ్యేది మంత్రులు, అధికారులేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
Next Story

