Fri Dec 05 2025 21:53:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విడదల రజనీ బెయిల్ పిటీషన్ విచారణ
మాజీ మంత్రి విడదల రజనీ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది

మాజీ మంత్రి విడదల రజనీ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. విడదల రజనీతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ, తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలంటూ విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.
స్టోన్ క్రషర్ నుంచి...
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజనీ స్టోన్ క్రషర్ ను బెదిరించడమే కాకుండా అధికారులను పంపి దాడులు చేస్తామని హెచ్చరించి 2.26 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్న ఫిర్యాదుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తుండటంతో విడదల రజనీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Next Story

