Mon Mar 16 2026 05:58:32 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రి వట్టి వసంత మృతి
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ చికిత్స సొందుతూ మరణించారు

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ చికిత్స సొందుతూ మరణించారు. ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని అపోలో ఆసుపత్రిలో మరణఇంచినట్లు సన్నిహితులు తెలిపారు. వట్టి వసంతకుమార్ స్వస్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల. కాపు సామాజికవర్గానికి చెందిన వట్టి వసంతకుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు.
మంత్రిగా...
2004,2009 లో ఉంగుటూరు నియోకవర్గం నుంచి ఆయన వరసగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన అంత్యక్రియలను పూండ్ల గ్రామంలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వట్టి వసంత కుమార్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story

