Sun Mar 08 2026 04:43:53 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయంతోనే?
నెల్లూరు గోవా మద్యం విక్రయాల్లో వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

నెల్లూరు గోవా మద్యం విక్రయాల్లో వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అండ లేకుండా గోవా మద్యం ఏపీలో విక్రయించే ఛాన్స్ లేదన్నారు. గోవా నుంచి మద్యం తక్కువ ధరకు తెప్పించి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు గడించాలన్నది ఆ ఎమ్మెల్యే లక్ష్యంగా కనిపిస్తుందని చెప్పారు.
సీబీఐ విచారణకు....
గతంలోనూ గోవా కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో మరణించిన సంఘటనను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. దీనిపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని సోమిరెడ్డి కోరారు.
Next Story

