Sun Mar 15 2026 08:54:42 GMT+0530 (India Standard Time)
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా
వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు

వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శిద్దా రాఘవరావు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2014లో దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి నాటి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.
ఓటమి పాలు కావడంతో...
2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన గ్రానైట్ వ్యాపారాల కోసం అప్పటి అధికార వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో దర్శి టిక్కెట్ ను ఆశించినా జగన్ ఇవ్వలేదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే దర్శి టిక్కెట్ కేటాయించడంతో శిద్ధా రాఘవరావు కుటుంబం గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయింది. పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.
Next Story

