Fri Jan 30 2026 11:02:07 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్, బ్రాహ్మణిల మ్యాచ్ ఫిక్సింగ్
మాజీ మంత్రి శంకరనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటులో బాలకృష్ణకు భాగస్వామ్యం ఉందన్నారు

మాజీ మంత్రి శంకరనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటులో బాలకృష్ణకు భాగస్వామ్యం ఉందన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ మరణానికి పరోక్షంగా చంద్రబాబు, బాలకృష్ణ కారణమని తెలిపారు. అదేరోజు లోకేష్, బ్రాహ్మణి పెళ్లి గురించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
ఎందుకు ఎన్టీఆర్ కు...
వెన్నుపోటు పొడిచినప్పుడు తండ్రికి ఎందుకు బాలకృష్ణ అండగా ఎందుకు నిలవలేదని మాజీ మంత్రి శంకరనారాయణ ప్రశ్నించారు. బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరని ఆయన తెలిపారు. బాలకృష్ణ కొడుకుగా ఎన్టీఆర్ కు ఎన్నడూ మరచిపోని ద్రోహం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

