Mon Jun 23 2025 03:59:33 GMT+0000 (Coordinated Universal Time)
Rk Roja : చాలా తప్పు చేస్తున్నారు.. ఇంతకు ఇంత అనుభవిస్తారు
తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలా తప్పులు చేస్తున్నారని, అంతకు అంత అనుభవిస్తారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు

తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలా తప్పులు చేస్తున్నారని, అంతకు అంత అనుభవిస్తారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలపై రాష్ట్రంలో ప్రతిరోజూఅత్యాచారాలు జరుగుతుంటే పవన్ కల్యాణ్ కు పట్టదా? అని రోజా ప్రశ్నించారు. వాటిని ప్రశ్నించరా? అని నిలదీశారు. మహిళల సంక్షేమంపైన దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులను బనాయించాలని చూస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.
మహిళలపై అఘాయిత్యాలు...
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే రేణుకా చౌదరి, వైఎస్ షర్మిలకు ఇవి కనిపించవా? అని రోజా ప్రశ్నించారు. ఒంటికాలు మీద జగన్ పైన, భారతి రెడ్డిపైన లేస్తున్నారన్నారు. అక్రమ కేసులను పక్కనపెట్టాలని, ఒక పథకం ప్రకారం చంద్రబాబు, లోకేష్ లు వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆర్కే రోజా అన్నారు. అనంతపురంలో తన్మయ హత్యకు గల కారణాలు బయటకు వచ్చి ప్రభుత్వం బద్నాం అవుతుందని భావించి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ను అవలంబిస్తుందని అన్నారు.
Next Story