Wed Jan 07 2026 18:48:58 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు జిల్లా జైలుకు ఆర్కే రోజా
మాజీ మంత్రి ఆర్కే రోజా నెల్లూరు జిల్లా జైలుకు కు వచ్చారు

మాజీ మంత్రి ఆర్కే రోజా నెల్లూరు జిల్లా జైలుకు కు వచ్చారు. నెల్లూరు జిల్లాలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని పరామర్శించారు. ములాఖత్ లో రోజా వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన తర్వాత ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గ్రూపులతో హత్యలు జరిగితే దానిని వైసీపీ నేతలపైకి నెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ లకు అధికారులు భజన బ్యాచ్ లా తయారయ్యారన్నారు.
రాయలసీమకు అన్యాయం...
సంపద పెంచుతామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పులు చేయడం తప్ప మరేదీ చేయడం లేదన్నారు. రాయలసీమ ప్రాంత వాసులకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఆస్తులను కాపాడుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేశారని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశార. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలోనూ చంద్రబాబు క్రెడట్ చోరీకి దిగారన్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
Next Story

