Sat Jan 31 2026 20:57:57 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. వైద్యులేమన్నారంటే?
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు

మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వ్యక్తిగత సిబ్బంది ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు నిర్వహించి...
కొడాలి నానికి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత సమస్యలున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే కొడాలి నానికి చికిత్స ప్రారంభించారు. కొడాలి నాని కొద్ది గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని ఏఐజీ వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియడంతో గుడివాడ నుంచి ఆయన అనుచరులు హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.
Next Story

