Fri Dec 05 2025 23:14:53 GMT+0000 (Coordinated Universal Time)
డీఎల్ కామెంట్స్... వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయంటే?
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడతారని డీఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోట ీచేయడం ఖాయమని ఆయన అన్నారు.
జగన్ పాలనలో...
వైఎస్ జగన్ పాలనలో ఏవర్గం ప్రజలు సంతృప్తికరంగా లేరని అన్నారు. దోచుకోవడమే తప్ప జగన్ కు ఈ నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదని తీవ్రవిమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమయిందని, ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ కు నిజాయితీ ఉన్నా పాలనపరమైన అనుభవం లేదని ఆయన తెలిపారు. ఏపీ భవిష్యత్ కోసం ఇద్దరూ కలసి పోటీ చేయాలని తాను కోరుతున్నానని డీఎల్ అన్నారు.
Next Story

