Fri Mar 20 2026 01:04:25 GMT+0530 (India Standard Time)
మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు కాబినెట్లో..

హైదరాబాద్ : టిడిపి నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు కాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Next Story

