Sun Mar 15 2026 15:02:37 GMT+0530 (India Standard Time)
సీఎం పర్యటనకు దూరంగా బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మార్కాపురంలో చేదు అనుభవం ఎదురైంది. జగన్ పర్యటనలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మార్కాపురంలో చేదు అనుభవం ఎదురైంది. జగన్ పర్యటనలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన మరికాసేపట్లో మార్కాపురంలో జరగనుంది. ఈరోజు మార్కాపురంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేయననున్నారు.
ఈబీసీ నేస్తం...
ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అయితే బాలినేనికి ప్రొటోకాల్‌లో అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరుపై మండిపడ్డ బాలినేని సీఎం సమక్షంలో జరుగనున్న ‘‘ఈబీసీ నేస్తం’’ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఒంగోలుకు వెళ్లిపోయారు. బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బాలినేని అనుచరులు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు
Next Story

