Thu Jan 29 2026 02:41:07 GMT+0000 (Coordinated Universal Time)
పదవి నుంచి తప్పుకున్న బాలినేని?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. గత కొంతకాలంగా వైసీపీ హైకమాండ్‌పై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్నారు. అయితే బాలినేని మాత్రం స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ఆయన హైదరాబాద్‌లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.
అలాంటిదేమీ లేదన్న...
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మార్కాపురంలో పర్యటించినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బాలినేని గౌరవానికి ఎటువంటి భంగం ఉండదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడతారన్న మంత్రి కాకాణి ఇదంతా టీ కప్పులో తుపాను వంటిదేనని అన్నారు. రీజనల్ కో ఆర్డినేటర్‌గా తప్పుకున్నారనది వట్టి ప్రచారం మాత్రమేనని కాకాణి కొట్టిపారేశారు.
Next Story

