Sun Dec 14 2025 02:40:38 GMT+0000 (Coordinated Universal Time)
టికెట్ రానివాళ్లే టీడీపీలోకి
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో టిక్కెట్ రాని వాళ్లే టీడీపీలోకి వెళుతున్నారన్నారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో టిక్కెట్ రాని వాళ్లే టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది ఎన్నికలకు ముందు సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీకి అడ్డదారులు తొక్కడం ఎప్పుడూ అలవాటేనని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనని, తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు.
మళ్లీ నేనే...
తనపై నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ నుంచి నారాయణ పోటీ చేసినా గెలుపు తనదేనని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరిస్తారన్నారు. సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి తిరిగి అధికారానికి అప్పగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత మంది వైసీపీ నేతలు వెళ్లినా పార్టీకి ప్రత్యేకంగా జరిగే నష్టం ఏమీ ఉండదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Next Story

