Sat Dec 07 2024 15:51:27 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి ధర్మాన పీఏ అరెస్ట్
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వరకూ మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. పీఏ మురళిపై ఇరవై ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు తమ సోదాల్లో కనుగొన్నారు.
అనేక చోట్ల ఆస్తులు...
దీంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న ఏసీబీ అధికారులు సోదాల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. మురళి ఇంటి నుంచి కిలో బంగారం తో పాటు, 11.36 కిలోల వెండి ఆభరణాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story