Thu Mar 19 2026 15:15:48 GMT+0530 (India Standard Time)
కంటతడి పెట్టుకున్న కేఈ
మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు. సొంత గ్రామమైన కంభాలపాడులో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు

మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు. తన సొంత గ్రామమైన కంభాలపాడులో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత కేఈ కృష్ణమూర్తి గ్రామానికి రావడంతో పెద్దయెత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన పట్ల టీడీపీ కార్యకర్తలు చూపిన అభిమానానికి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పూరిత ధోరణి సాగుతుందన్నారు.
గెలుపు ఖాయం....
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు త్వరలోనే చంద్రబాబును కంభాలపాడుకు తీసుకువస్తానని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story

