Sat Dec 06 2025 07:50:15 GMT+0000 (Coordinated Universal Time)
షరీష్ సెన్సేషనల్ కామెంట్స్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతోనే పొత్తు
మాజీ ఛైర్మన్ ఎంఎ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాలు కలసి పోటీ చేస్తాయన్నారు

శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఎ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాలు కలసి పోటీ చేస్తాయని చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేస్తాయని, విజయం తథ్యమని షరీఫ్ తెలిపారు.
వైసీపీని గద్దె దించేందుకు....
నరసాపురం మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత పాలన, తిరిగి అభివృద్ధి జరగాలంటే టీడీపీ కూటమినే గెలిపించాలని ఆయన కోరారు. ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని మినహాయించి జనసేన, వామపక్షాలతో కలసి టీడీపీ పోటీకి దిగుతుందని షరీఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమమయ్యాయి.
Next Story

