Sat Mar 07 2026 19:36:44 GMT+0530 (India Standard Time)
Breaking : నల్లారి రాజీనామా
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామాను పంపారు

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు. ఆయన త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంప్రందింపులు జరిపినట్లు తెలిసింది.
బీజేపీలోనే...
త్వరలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు ఏపీలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని తెలిసింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ యాక్టివ్ గా లేని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఎలా యాక్టివ్ అవుతారన్నది చూడాల్సి ఉంది.
Next Story

