Wed Mar 18 2026 21:13:32 GMT+0530 (India Standard Time)
ఈ నెల 30న కూటమి మ్యానిఫేస్టో విడుదల?
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 30వ తేదీన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 30వ తేదీన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. పీలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటన సందర్భంగా మ్యానిఫేస్టోను విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడిందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రధాని రాకున్నా...
ఎన్నికలకు ఇంకా ఎక్కువ రోజులు సమయం లేకపోవడంతో ఈ నెల 30వ తేదీన మ్యానిఫేస్టో విడుదల చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్యనేతలతో కలసి మ్యానిఫేస్టో విడుదల చేసే అవకాశముంది. నిన్న వైసీపీ మ్యానిఫేస్టో విడుదల కావడంతో అంతకు మించిన మ్యానిఫేస్టోను రూపకల్పన చేసి జనం ముందు ఉంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు.
Next Story

