Sun Mar 22 2026 03:22:24 GMT+0530 (India Standard Time)
అనుకున్నదే కాని.. ఈసారి?
సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు జగన్ మరోసారి రెన్యువల్ చేస్తారని అందరూ ఊహించిందే

సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు జగన్ మరోసారి రెన్యువల్ చేస్తారని అందరూ ఊహించిందే. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఆయన గతంలోనూ మంత్రి పదవిని చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి, అధికారంలోకి రాగానే మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. మరోసారి ఆయనకు ఉత్తరాంధ్ర లోపెద్దగా జగన్ ఆయన పదవిని రెన్యువల్ చేశారు. అయితే మరోసారి మున్సిపల్ శాఖను బొత్స సత్యనారాయణకు అప్పగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

