Mon Feb 02 2026 10:48:42 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరు ఘటన : ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్
గుంటూరు ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ఏలూరు రోడ్డులోని ఒక లాడ్జిలో ఉండగా ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే ఉయ్యూరు శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం గుంటూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఒక లాడ్జిలో ఉండగా ఉయ్యూరు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వెస్ట్ సీటును ఆశించి...
నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ చేసింది ఉయ్యూరు శ్రీనివాస్. ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సంక్రాంతి కానుకల పేరిట ఆయన చంద్రబాబును పిలిచి హంగామా చేశారని అంటున్నారు. మృతరాలు బొలిశెట్టి రమాదేవి కుమారుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉయ్యూరు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకు్నారు.
Next Story

