Sun Mar 15 2026 13:25:17 GMT+0530 (India Standard Time)
బాలకృష్ణ గైర్హాజరయినా సస్పెన్షన్ ?
నందమూరి బాలకృష్ణ సభకు హాజరు కాకపోయినా ఆయన పేరును స్పీకర్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది

బాలకృష్ణ సభకు హాజరు కాకపోయినా ఆయన పేరును స్పీకర్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ చేసిన వారి పేర్ల జాబితాను చదువుతూ నందమూరి బాలకృష్ణ పేరును స్పీకర్ చదివారు. అయితే నందమూరి బాలకృష్ణ రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.
అధికారుల తప్పిదం...
అయితే ఇది అధికారుల తప్పిదంగా చెబుతున్నారు. అధికారులు నందమూరి బాలకృష్ణ సభకు హాజరు కాకున్నా ఆయన పేరును జాబితాలో చేర్చి ఆ లిస్ట్ ను స్పీకర్ కు ఇవ్వడంతో ఆయన చదివేశారు. తర్వాత స్సీకర్ తమ్మినేని సీతారాం సభలో బాలకృష్ణ లేరని తెలుసుకుని ఆయన పేరును తొలగించారు.
Next Story

