Fri Sep 13 2024 08:57:42 GMT+0000 (Coordinated Universal Time)
రైళ్లన్నీ ఫుల్లు.. పండగ ప్రయాణమెలాగో?
సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లలో కూడా టిక్కెట్లు ముందుగానే బుక్ కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడక తప్పవని అంటున్నారు
సంక్రాంతి పండగ అంటేనే సొంతూళ్లకు అందరూ పయనమవుతారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులతో పాటు రైళ్లను కూడా నడుపుతారు. అయినా ఈసారి రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని రైళ్లలో టిక్కెట్లు బుక్ అయ్యాయి. ప్రత్యేక రైళ్లలో కూడా టిక్కెట్లు ముందుగానే బుక్ కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడక తప్పవని అంటున్నారు. సరిపడా రైళ్లను వేసినా అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళుతుండటంతో రైలు ప్రయాణం కష్టంగా మారింది.
ఎక్కువ రైళ్లను వేసినా...
గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ రైళ్లను వేసినా రద్దీ తగ్గడం లేదు. కరోనా తర్వాత పెద్దయెత్తున ప్రజలు సొంతూళ్లకు చేరుకోవాలన్న తపనతో రైళ్లలో టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. రిజర్వేషన్ల బెర్త్ లన్నీ ఫిలప్ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ చాంతాడ ఉండటంతో కన్ఫర్మ్ కావడం కష్టమేనని అంటున్నారు. ఇక చివరి ప్రయత్నంగా తత్కాల్ టిక్కెట్ల కోసం ప్రయత్నించి దక్కితే వెల్ అండ్ గుడ్. లేకుంటే ప్రయివేటు బస్సులను, వాహనాలను ఆశ్రయించడమే శరణ్యమని భావిస్తున్నారు. ఈ పండగ సీజన్ లో మూడున్నర లక్షల మంది ప్రయాణికులు వెళతారన్న అంచనా ఉంది.
Next Story