Thu Dec 11 2025 16:54:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ముందుకు?
స్కిల్ డెవలెపమెంట్ కార్పొరేషన్ కు సంబంధించి జరిగిన అవకతవకలపై నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయనుంది

స్కిల్ డెవలెపమెంట్ కార్పొరేషన్ కు సంబంధించి జరిగిన అవకతవకలపై నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయనుంది. ఈ విచారణకు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఘంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణలు హాజరుకానున్నారు. అప్పటి ఓఎస్డీ కృష్ణ ప్రసాద్ కూడా ఈరోజు విచారణకు హాజరు కానున్నారు.
26 మందికి...
మొత్తం 26 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. దాదాపు 240 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు అనుమానాలున్నాయి. పలు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నేటి నుంచి విచారణ జరపనుంది.
Next Story

