Mon Mar 09 2026 11:53:02 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగం పెంచారు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగం పెంచారు. ఏపీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో నేడు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
ఆస్తులను సీజ్ చేసి...
ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఛార్జిషీట్ నమోదు చేశారు. సిట్ నుంచి వివరాలను తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితుల ఆస్తులను కూడా సీజ్ చేశారు. దీంతో నేడు ఈడీ విచారణకు ఈరోజు ముగ్గురు హాజరవ్వాలని ఆదేశించడంతో ఈ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచినట్లు కనపడుతుంది.
Next Story

