Sat Dec 13 2025 22:35:56 GMT+0000 (Coordinated Universal Time)
Encounter : ఆరుగురు మావోయిస్టుల హతం
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టుల ఎదురుపడటంతో లొంగిపోవాలని హెచ్చరించినా అందుకు వారు సముఖత వ్యక్తం చేయకుండా కాల్పులకు దిగారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
అల్లూరి జిల్లాలో...
దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేత ఉన్నట్లు సమాచారం. అయితే మావోయిస్టుల్లో ఎవరు మృతి చెందారన్న దానిపై మాత్రం ఇంకా అధికారులు ప్రకటించలేదు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను, మావోయిస్టు సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story

