Thu Mar 19 2026 12:37:53 GMT+0530 (India Standard Time)
చర్చలకు వెళ్తారట...ముందుగా సమావేశమై?
మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించింది.

మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించింది. అయితే జీవో రద్దు అయ్యేంత వరకూ తాము చర్చలకు వెళ్లబోమని నిన్నటి వరకూ భీష్మించుకుని కూర్చున్న ఉద్యోగ సంఘాలు కొంత దిగి వచ్చినట్లే కనపడుతుంది.
వెళ్లాలంటున్న.....
మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో చర్చలకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై చర్చిస్తారు. కొందరు చర్చలకు వెళ్లాలని భావిస్తున్నారు. చర్చలకు వెళ్లకుండా ఎన్నాళ్లిలా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొందరు వాదిస్తున్నారు. దీనిపై 11 గంటల తర్వాత ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
Next Story

