Fri Dec 05 2025 09:51:45 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జల నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు పిలుపు
ఈరోజు సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ పై జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. నిన్న చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ జగన్ కు పీఆర్సీ నివేదికను సమర్పించింది. ఇందులో 11 సిఫార్సులను కమిటీ చేసింది. 14 శాతం ఫిట్ మెంట్ ను కమిటీ సిఫార్సు చేసింది. 11 పీఆర్సీ కమిటీ మాత్రం 27 శాతం ఇవ్వవొచ్చని సూచించింది. దీనిపై జగన్ ఈరోజు, రేపటిలోగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశంలోనే....
ఈరోజు సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చింది. మరికొద్ది సేపట్లో సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చించనున్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఒక అవగాహన కుదిరేలా ఈ సమావేశం జరగనుంది. తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డితో కూడా ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తారన్న ఆశలు పెట్టుకున్నాయి.
Next Story

