Thu Mar 19 2026 14:01:51 GMT+0530 (India Standard Time)
నేడు చీఫ్ సెక్రటరీకి సమ్మె నోటీసు
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు నేడు చీఫ్ సెక్రటరీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు నేడు చీఫ్ సెక్రటరీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది.
జీవోను రద్దు చేయాలని...
అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు కలసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ వేతన సవరణ పై ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు సమ్మె నోటీసును అందచేస్తామని, మధ్యాహ్నం మూడు గంటలకు చీఫ్ సెక్రటరీ తమకు సమయం ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
Next Story

