Thu Mar 19 2026 11:57:04 GMT+0530 (India Standard Time)
వేషాలు మార్చి.. బ్యానర్లు కట్టి చలో విజయవాడ
ఉద్యోగులు విజయవాడకు చేరుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు మారువేషాలతో బస్సులు, రైళ్లలో చేరుకున్నారు

ఉద్యోగులు విజయవాడకు చేరుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు మారువేషాలతో బస్సులు, రైళ్లలో విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు నిన్ననే చేరుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్నా చౌక్ వద్దకు చేరుకుంటున్న ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
పెళ్లి వారమండీ....
ఇక కర్నూలు జిల్లాకు చెందిన ఉద్యోగులు విన్నూత్న ఆలోచన చేశారు. తాము ప్రయాణించే బస్సును పెండ్లి బస్సుగా చూపిస్తూ విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నించారు. బస్సుకు పెళ్లివారమండీ అని బ్యానర్ కట్టారు. అయితే కర్నూలు నుంచి బయలుదేరిన ఈ బస్సును ప్రకాశం జిల్లా గిద్దలూరులో అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story

