Thu Mar 19 2026 09:46:08 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఉద్యోగుల ఆందోళన షురూ
నేటి నుంచి ఉద్యోగుల ఆందోళనలు మొదలుకానున్నాయి. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలుఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి

నేటి నుంచి ఉద్యోగుల ఆందోళనలు మొదలుకానున్నాయి. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు ఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాలు ధర్నాను నిర్వహించనున్నాయి. కొత్త పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ తో ఉద్యోగులు ఆందోళన చేయనున్నారు.
చర్చలకు నేడు కూడా....
నేడు కూడా మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించే అవకాశముంది. నిన్న చర్చలకు పిలిచినా వారు రాలేదు. నేడు మరోసారి చర్చలకు పిలవాలని నిర్ణయించారు. చర్చలకు వస్తే పీఆర్సీ జీవో రద్దు గురించి ఆలోచిస్తామని మంత్రుల కమిటీ చెబుతుంది. చర్చలు జరపకుండానే ఆందోళనకు దిగితే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
Next Story

