Thu Mar 20 2025 18:48:05 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏలూరు టీడీపీలోకి మేయర్ దంపతులు
నేడు ఏలూరు మేయర్ దంపతులు టీడీపీలో చేరనున్నారు. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ తో పాటు ఆమె భర్త పెదబాబు టీడీపీలో చేరనున్నారు

నేడు ఏలూరు మేయర్ దంపతులు టీడీపీలో చేరనున్నారు. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ తో పాటు ఆమె భర్త పెదబాబు టీడీపీలో చేరనున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వీరు వైసీపీలో చేరి మేయర్ పదవిని దక్కించుకున్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వారు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
లోకేష్ సమక్షంలో...
ఉండవల్లిలోని నారా లోకేష్ సమక్షంలో వీరి చేరిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏలూరు కార్పొరేషన్ ను గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు మేయర్ దంపతులతో పాటు ముప్ఫయి మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరతారని సమాచారం. అదే జరిగితే ఏలూరు కార్పొరేషన్ టీడీపీ పరం అయినట్లే.
Next Story