Tue Jan 20 2026 23:17:04 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. వైసీపీకి పరాజయం తప్పదని ఆయన తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించిన వారు దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ లేరన్నారు. చివరకు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా తాము గెలుస్తామని చెబుతున్నారన్నారు. జూన్ 4వ తేదీన నాలుగు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా తర్వాత రౌండ్ లో తమదే ఆధిక్యత అన్న ధీమాలో ఉంటారన్నారు.
దేశంలో మాత్రం...
జగన్ గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారని, అది జరగదన్నారు. దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అయితే బీజేపీకి గతం కంటే సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం లేదన్నారు. దేశంలో మోదీ, బీజేపీపై అసంతృప్తి ఉందని, అయితే ఆగ్రహం మాత్రం లేదని అన్నారు. గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాాలను కొట్టి పారేయలేమన్నారు.
Next Story

