Wed Jan 21 2026 00:41:13 GMT+0000 (Coordinated Universal Time)
Prashanth Kishore : జగన్ కు ఓటమి తప్పదు.. జగన్ జననేత కాదు
ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి గెలవడం కష్టమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి గెలవడం కష్టమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ జగన్ జనం నుంచి వచ్చిన నేత కాదని, తనకు తాను తయారు చేసుకున్న లీడర్ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం డబ్బులు పంచడానికే తన సమయాన్ని వెచ్చించారన్నారు. జనం నుంచి వచ్చిన నేతకు జనం సమస్యలు తెలుస్తాయని, కానీ తయారు అయిన నేత కావడంతో తాను ఇచ్చింది తీసుకోవాలని, తాను చేసిందే శాసనం అన్న రీతిలో పాలన సాగిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
అభివృద్ధి లేకుండా...
యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న ప్రశాంత్ కిషోర్, కేవలం నగదును పంచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఎక్కువ మంది జగన్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్నారని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ప్రజలను ఆకాంక్షించలను పట్టించుకోని ఛత్తీస్గడ్ మాజీ ముఖ్యమంత్రిని భూపేశ్ బఘేల్ ను ప్రజలు ఎలా తిరస్కరించారో చూశామన్న ఆయన జగన్ కూడా అదే రీతిలో ఓటమి పాలవుతున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దేశంలో 300 స్థానాలను సాధించడం ఖాయమని, తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని ఆయన అంచనా వేశారు. బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
Next Story

