Tue Mar 17 2026 21:02:44 GMT+0530 (India Standard Time)
విజయవాడకు చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్
విజయవాడకు ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా చేరుకున్నారు

విజయవాడకు ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా చేరుకున్నారు. ఆయన నగరంలోని నోవాటెల్ లో బస చేశారు. ఆయనకు హోటల్ వద్ద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను భారత ఎన్నికల సంఘం స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా నియమించింది.
ఎన్నికల నిబంధనలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా ఇటీవల నియమించడంతో ఆయన నిన్న రాత్రి రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్నారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికలు, వాటి పరిశీలన వంటివి ఆయన చేయనున్నారు. ఎలాంటి నిబంధనలను అతిక్రమించారని తెలిసినా తక్షణం చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ ను నియమించింది.
Next Story

