Fri Dec 05 2025 17:52:40 GMT+0000 (Coordinated Universal Time)
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.

తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తగిన కోరం లేకపోవడంతో్ రేపటికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ పదవికోసం వైసీపీ, టీడీపీ లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దగ్గరుండి వైసీపీ కౌన్సిలర్లను తమ పార్టీలోకి తెచ్చారు. అయితే నేటి సమావేశానికి పది మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు.
టీడీపీ, వైసీపీలు...
అయితే కాకినాడ జిల్లా వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా అదే రీతిలో తన పార్టీకి చెందిన కౌన్సిలర్లను కాపాడుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఎలాగైనా తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు తిరిగి ఎన్నిక నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Next Story

