Sat Mar 07 2026 21:57:12 GMT+0530 (India Standard Time)
జగన్ ఆ పదవిని ఈమెకే ఇచ్చారు
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది.వైసీపీ జకియా ఖానమ్ ను జగన్ డిప్యూటీ ఛైర్మన్ గా ఎంపిక చేశారు.

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ను జగన్ డిప్యూటీ ఛైర్మన్ గా ఎంపిక చేశారు. తొలిసారి పెద్దల సభలో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా ఎన్నిక కాబోతుంది. ఇప్పటికే శాసనమండలి ఛైర్మన్ గా దళిత వర్గానికి చెందిన మోషేన్ రాజు బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
నేడు ఎన్నిక.....
ఇప్పుడు డిప్యూటీ మండలి ఛైర్మన్ పదవి కూడా మైనారిటీలకు జగన్ కేటాయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్న సంకేతాలను జగన్ పంపించారు. ఈరోజు శాసనమండలిలో డిప్యూటీ మండలి ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
Next Story

