Tue Jan 20 2026 16:52:54 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు ఆగ్రహం.. ఆ ఇద్దరు అధికారులు కోర్టుకు రండి
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను ఎందుకు నిర్వహిచలేకపోతున్నారంటూ ఆగ్రహం చెందింది. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై టీడీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
సీపీ, కమిషనర్ లను...
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను నిర్వహించకపోవడానికి కారణాలేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ తో పాటు విజయవాడ పోలీసు కమిషనర్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

