Tue Jan 20 2026 22:18:03 GMT+0000 (Coordinated Universal Time)
పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు
పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు

పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. మరో రోజు గడువు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల బ్యాలెట్ల వినియోగించుకున్నారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మిగిలిన ఓటర్లు ఈ నెల 9వ తేదీ లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు.
ఈ నెల 9వ తేదీ వరకూ...
ఒంగోలులో ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు తెలిసిందన్న మీనా చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్వకాల మేరకే ఎన్నికలలో నిబంధనలను ఒక్కోసారి సడలిస్తుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ను వినియోగించుకుని వారికి కేటాయించిన విధులకు వెళ్లాలని ఆయన కోరారు.
Next Story

