Thu Mar 19 2026 17:40:41 GMT+0530 (India Standard Time)
Ap Elections : ఏపీలో తుది ఫలితాలు ఎప్పుడు వెల్లడవుతాయంటే?
ఏపీలో ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కొన్ని విషయాలను వెల్లడించారు.

ఏపీలో ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కొన్ని విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటలలోపు పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయని ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వివరించారు.
మూడు నియోజకవర్గాల్లో...
మొత్తం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లెక్కింపు జరుగుతుందన్న సీఈవో, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లో మాత్రమే 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుందని చెపపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు అదనపు టేబుళ్లు ఏర్పాట్లు చేసినట్లు సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
Next Story

