Fri Nov 08 2024 13:53:38 GMT+0000 (Coordinated Universal Time)
YCP : వైసీపీ ఎమ్మెల్యే గృహనిర్బంధం.. ఈసీ సీరియస్
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఓటరు పై చేయిచసుకున్న వైసీపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆయనను పోలింగ్ పూర్తయ్యేంత వరకూ బయటకు రానివద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు.
ఆయన వాదన ఇదీ...
తెనాలిలో ఈరోజు ఉదయం వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై చేయి చేసుకున్నాడు. అయితే ఆ ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ చెబుతుండగా, ఆయన చేతిలో దెబ్బతిన్న ఓటరు మాత్రం తాను లైన్ లో రావాలని కోరినందుకే ఎమ్మెల్యే తనపై దాడికి దిగారని చెబుతున్నారు.
Next Story