Thu Jan 29 2026 04:42:07 GMT+0000 (Coordinated Universal Time)
పిన్నెల్లి అరెస్ట్ పై ఈసీ స్పందన ఇదే
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై స్పందించిన ఎన్నికల కమిషన్ స్పందించింది.

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై స్పందించిన ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనమని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎంతటి వారికైనా.
ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఒక గుణపాఠమని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈవీఎం ద్వంసానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఈ ఘటనకు సరైన ముగింపు లభించిందని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరొకరు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుకుండా సరైన ముగింపు లభించిందని అభిప్రాయపడింది.
Next Story

