Fri Mar 20 2026 11:19:16 GMT+0530 (India Standard Time)
ఏయూ వీసీపై విచారణకు ఈసీ ఆదేశం
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది.

ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారంటూ ప్రసాద్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసినట్లు ఆరోపించింది.
జిల్లా కలెక్టర్ కు ఆదేశం...
దీనిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఆర్డీవో హుసేన్ సాహెబ్ కు విచారణ బాధ్యతలను అప్పగించారు.
Next Story

