Wed Mar 18 2026 18:58:25 GMT+0530 (India Standard Time)
High Court : గాజుగ్లాసు గుర్తు...విచారణ వాయిదా
గుర్తుల ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. గ్లాసు గుర్తు పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది

గుర్తుల ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. గ్లాసు గుర్తు పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జనసేన కు మాత్రమే గాజుగ్లాసు గుర్తును కేటాయించాలని, ఆ సింబల్ ను జనసేన పోటీ చేయని చోట కూడా ఫ్రీజ్ చేయాలిన టీడీపీ తన పిటీషన్ లో కోరింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తాము ఇప్పటికే న్యాయస్థానానికి చెప్పామని, జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలలో, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం ఇతరులకు కేటాయించబోమని స్పష్టం చేసింది.
టీడీపీ పిటీషన్ పై...
అయితే 175 నియోజకవర్గాల్లో జనసేన గుర్తు గాజు గ్లాస్ ను ఫ్రీజ్ చేయాలని కోరుతూ దాఖలయిన పిటీషన్ పై విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే తాము నిర్ణయం తీసుకున్నామని, రిటర్నింగ్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. దీంతో ఏపీ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరి సోమవారం ఎటువంటి నిర్ణయం వెలువడనుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

