Wed Dec 17 2025 14:15:07 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : గాజు గ్లాసు ఫ్రీ సింబల్ కావడంతో.. మొదలయిన కలవరం
జనసేన పార్టీకి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది

జనసేన పార్టీకి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా చేస్తూ ప్రకటన చేసింది. జనసేన పార్టీని ఎన్నికల కమిషన్ కేవలం రిజిస్టర్ పార్టీగానే గుర్తించింది. అందుకే గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదే జరిగితే జనసేన అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈగుర్తును కేటాయించే అవకాశాలుండటంతో కూటమి పార్టీల్లో కొంత ఆందోళన బయలుదేరింది. దీనిపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. పవన్ ప్రత్యేకంగా లీగల్ టీంతో సమావేశమై దీనిని అధిగమించేందుకు అవసరమైన చర్యల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

