Tue Jan 20 2026 15:29:01 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : ఒకే కుటుంబానికి యాభై రెండు వేలు.. తల్లికి వందనం
విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ తల్లికి వందనం అందుకున్న కుటుంబంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుగా జూనియర్ కళాశాల ప్రాంగణంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పి.మాధవి, ఆమె నలుగురు పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వారితో లోకేశ్ ముఖాముఖి...
కొత్త చెరువు బీసీ కాలనీకి చెందిన పి.మాధవికి ఎనిమిదో తరగతి చదివే బాలు, ఏడో తరగతి చదివే నరసమ్మ, ఐదో తరగతి చదివే బేబీ, మూడో తరగతి చదివే సన అనే నలుగురు పిల్లలు ఉన్నారు. మాధవి నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద యాభై రెండు వేల రూపాయల సాయం అందింది. దీంతో పీటీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్ ముందగా తల్లి మాధవి, నలుగురు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. యూనిఫాం, మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.
Next Story

