Mon Mar 16 2026 02:58:51 GMT+0530 (India Standard Time)
మళ్లీ భూ ప్రకంపనలు...భయాందోళనలో ప్రజలు
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు ఆందోళనలు సృష్టిస్తున్నాయి. ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు ఆందోళనలు సృష్టిస్తున్నాయి. ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. పండగ పూట శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని రత్తకన్న గ్రామంలో భూమి కంపించింది. దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని గ్రామస్థులు చెప్పారు. దీంతో ప్రజలు భయపడి ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.
వారంలో ఏడోసారి....
ఈ ప్రాంతంలో భూమి కంపించడం వారం రోజుల్లో ఇది ఏడోసారి. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. అయితే ఎలాంటి భయం అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానే స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు.
Next Story

