Fri Dec 05 2025 19:13:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఆంధ్రప్రదేశ్ లో భూప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్ లో భూప్రకపంనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ప్రకాశం జిల్లాలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది

ఆంధ్రప్రదేశ్ లో భూప్రకపంనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ప్రకాశం జిల్లాలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళలనకు గురయ్యారు. వెంటనే ఇళ్లలో నుంచి బయటకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంట్లో సామాన్లు కూడా కింద పడటంతో భూ ప్రకంపనలుగా ప్రజలు గుర్తించారు.

ప్రకాశం జిల్లాలో...
ముండ్లమూరు మండలంలోని శకంరాపురం, పసుపు గల్లు, వేంపాడు, తాళ్లూరు మండలంలోని గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురంలో భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఇది సాధారణ భూప్రకపంపనలు మాత్రమేనని ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు. అయితే ఎటువంటి ఆస్తినష్టం జరగలేదు. రిక్టర్ స్కేల్ పై ఎంత తీవ్రతగా నమోదయిందన్నది కాసేపట్లో తెలియనుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

