Thu Mar 19 2026 02:59:34 GMT+0530 (India Standard Time)
ఇచ్ఛాపురం భూ ప్రకంపనలు.. బయటకు పరుగులు తీసిన ప్రజలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో స్వల్పంగా భూమి కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో స్వల్పంగా భూమి కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందరూ నిద్రమత్తులో ఉండగా భూమి కంపించడంతో ఒక్కసారిగా జనం భయపడుతూ బయటకు పరుగులు తీశారు.
రెండు సెకన్ల పాటు...
ఇచ్ఛాపురం ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిన మాట వాస్తవమేనని అధికారులు చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సహజంగా భూమిలో వస్తున్న మార్పుల ప్రకారం జరుగుతుంటాయని చెబుతున్నారు. ప్రజలు మాత్రం తాము భయపడి పరుగులు తీశామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు.
Next Story

