Sun Dec 03 2023 21:22:45 GMT+0000 (Coordinated Universal Time)
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రి వేడుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పది రోజులు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వైడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రాక ఎక్కువగా ఉంటుందని భావించి క్యూలైన్లను ఎక్కువగా ఏర్పాటు చేశారు. వీఐపీ దర్శనాలను కుదించారు.
ప్రత్యేక ఏర్పాట్లు...
ఈ నవరాత్రుల్లో ప్రత్యేక అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వనుండటంతో రాష్ట్రం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అందుకోసం కొండపైకి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. శరన్నవరాత్రులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని అధికారులు చెబుతున్నారు.
Next Story